Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. వేములపల్లి మండల వాసి మృతి..!

Miryalaguda : ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. వేములపల్లి మండల వాసి మృతి..!

వేములపల్లి, మన సాక్షి :

బైకును కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడే మృతి చెందాడు. మండల పరిధిలోని భీమవరం సూర్యాపేట రహదారిపై ద్విచక్ర వాహనదారుడు తన స్వగ్రామమైన మొలకపట్నం వెళుతుండగా శెట్టిపాలెం పరిధిలో చేదురు బావి బ్రిడ్జి దగ్గర సూర్యాపేట నుండి వస్తున్న ఎర్టిగా కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ద్విచక్ర వాహనదారున్ని ఢీకొట్టగా ఈ ప్రమాదంలో పోరెడ్డి వెంకటరమణారెడ్డి అక్కడకక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య పోరెడ్డి అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు డి .ఎస్సై .వెంకటేశ్వర్లు తెలిపారు. ముతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు