Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

కబ్జా చేసిన భూమిని తిరిగి ఇవ్వాలి..!

కబ్జా చేసిన భూమిని తిరిగి ఇవ్వాలి..!

అనంతగిరి, మన సాక్షి :

తండ్రి నుంచి వచ్చిన భూమిని కబ్జా చేసిన వ్యక్తుల నుండి తిరిగి తనకు అప్పగించాలని ఓ దళిత మహిళ కలెక్టర్ ను వినతిపత్రం ద్వారా వేడుకుంది. వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కిష్టాపురం గ్రామానికి చెందిన మద్దెల సీతకు తన తండ్రి దోమల అచ్చయ్య 30 ఏళ్ల క్రితం చనిపోగా తదనంతరం తనపై వారసత్వంగా ఎకరం 18 కుంటలు భూమిని పట్టా చేయడం జరిగిందన్నారు.

తన తండ్రి బ్రతికుండగా రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ పట్టా ద్వారా తనకు భూమిని అప్పగించినప్పటికీ గ్రామానికి చెందిన అగ్రకుల కుటుంబం తన తండ్రిని బెదిరింపులకు పాల్పడి సేద్యంకు అనుకూలంగా ఉన్న భూమిని కబ్జా చేసి వేరే భూమి తన తండ్రికి అప్పగించారని అట్టి భూమిని తనకు తిరిగి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశానన్నారు. దళితులపై ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడిన వారి పైన చర్యలు తీసుకొని తమ న్యాయం చేయాలని కోరినట్లు ఆమె తెలిపారు.

MOST READ : 

  1. Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!

  2. TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!

  3. February : ఫిబ్రవరి నెల.. భూమ్మీద ఉన్నవారికి ఇదే ఆఖరు.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యమే..!

  4. Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!

  5. Ration Cards : లిస్టులో పేరు లేకుంటే మళ్ళీ దరఖాస్తుకు అవకాశం.. కొత్త రేషన్ కార్డుల పై లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు