Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!

Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. మనదేశంలో కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. పదుల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు కూడా యూపీఐ ద్వారానే లావాదేవీలు కొనసాగుతున్నాయి. బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసేవారు చాలావరకు తగ్గిపోయారు. వ్యక్తులు గాని, వ్యాపారస్తులు గాని ఈజీ లావాదేవీలకు అలవాటు పడి UPI.. ఫోన్ పే, గూగుల్ పే ఇతర యూపీఐ యాప్ ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు.
అంతే కాకుండా ప్రస్తుతం బిజీ లైఫ్ లో ప్రతినెల చెల్లించే మొబైల్ రీఛార్జి, ఇంటర్నెట్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్, విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లు.. ఇలా నెలవారీగా చెల్లించేవి ఆటో పే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటున్నారు. దాంతో ఆటోమేటిక్ గా మన బిల్లులు పే అవుతాయి.
ఈ ఫీచర్ వల్ల సమయంతో పాటు గుర్తుకు లేకున్నా ఆటోమేటిక్ గా చెల్లింపులు జరుగుతాయి. అయితే ఈ ఫీచర్ వల్ల ఎన్ని ఉపయోగాలు అయితే ఉన్నయో దానివల్ల అంత నష్టం కూడా ఉంది. అయితే మన ఫోన్ పే, గూగుల్ పే లో ఆటోమేటిక్ ఆటో పే ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఉంటే ఉంటే మన సర్వీసులను ఆపేసినప్పటికీ కూడా అమౌంట్ కట్ అవుతూనే ఉంటుంది. ఒకసారి అవసరమైన వాటికి పే చేసుకుంటే నెక్స్ట్ మంత్ కూడా ఆటోమేటిక్ పే అవుతుంది. దీనిని డియాక్టివేట్ చేసుకోకుంటే చెల్లింపులు జరుగుతూనే ఉండి.. మన ఖాతా ఖాళీ అవుతుంది.
డి యాక్టివేట్ ఎలా చేయాలి..?
-
మీ స్మార్ట్ ఫోన్ లో ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి.
-
అప్పుడు పేమెంట్ మేనేజ్మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేయాలి.
-
ఆ తర్వాత పేమెంట్ మేనేజ్మెంట్ సెక్షన్ లో కనిపిస్తున్న ఆటో పే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
-
అలా చేసిన తర్వాత pause, Delte అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
-
మీరు ఆటో పైన తాత్కాలికంగా ఆపేయాలని అనుకుంటే pause ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
-
లేదంటే ఆటో పే శాశ్వతంగా ఆఫ్ చేయాలనుకుంటే Delete ఆప్షన్ ఎంచుకోండి.
-
అప్పుడు మీ ఆటో శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. దాంతో మీకు ఎలాంటి నష్టం ఉండదు.
Similar News :
-
ACB : ఫోన్ పే ద్వారా లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ సురేష్..!
-
Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!
-
Phonepe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇది అస్సలు మిస్ చేసుకోకండి..!
-
PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!
-
GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!









