Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా.. స్థానిక ఎన్నికల్లో అఖండ విజయం అందించాలి.. శాసనసభ్యులు లక్ష్మారెడ్డి..!

Miryalaguda : ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా.. స్థానిక ఎన్నికల్లో అఖండ విజయం అందించాలి.. శాసనసభ్యులు లక్ష్మారెడ్డి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా ఉంటానని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని మిర్యాలగూడ మండల పరిధిలోని 10 ఎంపీటీసీ స్థానాలైన ఐలాపురం ,చిల్లాపురం తుంగపాడ్ సామ్య గాని తండా ,జప్తి వీరప్ప గూడెం వెంకటాద్రి పాలెం, చింతపల్లి , కొత్త గూడెం,లక్ష్మీ పురం, గూడూరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలను నాయకుల సమస్యలను, కార్యకర్తలు సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కట్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తను గుర్తిస్తాము, వారికి అండగా ఉంటామని అన్నారు.

అలాగే వారి నుంచి సేకరించిన సమస్యలను
మన ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు,
జిల్లా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ కు తెలియజేసి వారందరి సహాయ సహకారాలతో ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమస్యలను పరిష్కరించేలా చేస్తామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఏవిధంగా కష్టపడి పనిచేసారో అదే విధంగా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా పని చేసి కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వార్డ్ మెంబెర్స్, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

■ MOST READ : 

  1. Nalgonda : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 22 మంది అభ్యర్థులు..!

  2. Nalgonda : రాజకీయ ప్రయోజనాల కోసమే కుల గణన సర్వే పై విమర్శలు.. గుత్తా సుఖేందర్ రెడ్డి..!

  3. Hyderabad : కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. నాచారం వాసులుగా గుర్తింపు..!

  4. Rahul Gandhi : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు..!

  5. Gold Price : రికార్డ్ స్థాయిలో రూ.8700 పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..!

మరిన్ని వార్తలు