తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లారాజకీయం

Narayanpet : కెసిఆర్, కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్..!

Narayanpet : కెసిఆర్, కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్..!

1000 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

పాలమూరు అభివృద్ధిని ఓరవలేకపోతున్న కేసీఆర్

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రజా పాలన ప్రభుత్వం ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న అప్పకపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల దగ్గర 1000 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పరిణిక రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవం అని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో అధికారంలో ఉండి జిల్లాలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ నిర్మించి ఇవ్వలేదన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రాష్ట్రంలో ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.

ఒక్కో నియోజకవర్గానికి 3500 మంజూరు చేశామన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు పేరు చెప్పి నాయకులు మార్కెటింగ్ వ్యాపారం చేసుకున్నారని అన్నారు. కెసిఆర్ చేసిన శాపం మనకు ఉరి అయిందని మండిపడ్డారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడితే కేసీఆర్ కండ్లు మండుతాయని వాపోయారు. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం సర్వే పనులు జరుగుతుంటే గ్రామాలలోని బిఆర్ఎస్ నాయకులు సర్వే పనులు జరగకుండా అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా ను అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే తండ్రి కొడుకులు ఇద్దరు అడ్డు తగులుతున్నారని వాపోయారు. కెసిఆర్ హయంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి రాయలసీమ ఎత్తిపోతల పథకం కు నీళ్లు తరలించకపోతుంటే చూస్తూ ఊరుకున్న కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రావాళ్లు నీళ్లు తరుచుకుపోతున్నారని మా పై అభండాలు మోపుతున్నారు అన్నారు. రాయలసీమలో ముచ్చుమర్రి పథకం నిర్మించుకున్నారన్నారు. తమ 14 నెలల ప్రజా పాలనలో జరిగిన అభివృద్ధి , కెసిఆర్ పది పది సంవత్సరాల లో జరిగిన అభివృద్ధి, ప్రధాని మోడీ 12 సంవత్సరాల పరిపాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేసిఆర్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

రాష్ట్రంలో కులగణన కార్యక్రమం చేపట్టి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడిందన్నారు. అప్పకుపల్లి దగ్గర ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పేరును స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టాలని అక్కడే ఉన్న సిఎస్ శాంతి కుమారి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డి మాట్లాడుతూ వచ్చే నాలుగు సంవత్సరాలలో నారాయణపేట నియోజకవర్గం రూపు రేఖలు మారుస్తా అన్నారు.

నియోజకవర్గంలో 40,000 గృహాలకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, 31 వేల కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ అందిస్తున్నామన్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాలకు 70 సంవత్సరాల నుండి ప్రైవేట్ బిల్డింగ్ లో కొనసాగుతున్నదని సొంత భవనం లేదని ఆ పాఠశాలకు సొంత భవనం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నీ కోరారు.

ఈరోజు చాలా సంతోషకరమైన రోజు అని 1000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు 26 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, 56 కోట్లతో నిర్మించిన వైద్య కళాశాల మొదటి సంవత్సరం అకాడమిక్ బ్లాకులను ప్రారంభించారు. రూపాయలు 130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల వసతిగృహం నిర్మాణానికి శంకుస్థాపన, రూపాయలు 200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల సముదాయానికి భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, సి ఎస్ శాంతి కుమారి, రాష్ట్ర డిజిపి జితేందర్ ,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనాయకులు పాల్గొన్నారు.

■ లేటెస్ట్ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 12 మంది పంచాయతీ కార్యదర్శులపై చర్యలు..!

  2. Hyderabad : రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్లపై నల్గొండ జిల్లా రైతు ధర్నా..!

  3. Cm Revanth Reddy : మహిళా సంఘాలకు డ్రస్ కోడ్.. వ్యాపారాభివృద్ధికి భారీ శుభవార్త..!

  4. Gold Price : తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు.. 22K తగ్గింది.. 24K పెరిగింది..!

మరిన్ని వార్తలు