Hyderabad : నడిరోడ్డుపై తండ్రిని కత్తితో పొడిచి చంపిన తనయుడు..!
Hyderabad : నడిరోడ్డుపై తండ్రిని కత్తితో పొడిచి చంపిన తనయుడు..!
మన సాక్షి, హైదరాబాద్ :
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కన్న తండ్రిని కొడుకు కిరాతకంగా కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ లాలాపేట చెందిన ఆరేళ్ల మొగలి (45) ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో పనిచేస్తున్నాడు.
అతని కుమారుడు సాయికుమార్ కూడా అదే కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే మద్యానికి బానిసైన మొగిలి తాగొచ్చి ఇంట్లో గొడవలు చేస్తుండేవాడు. కుటుంబ కలహాలతో పాటు వీరి మధ్య కొంతకాలంగా ఆస్తి తగదాలు కూడా జరుగుతున్నాయి. దాంతో విసిగిపోయిన కొడుకు సాయికుమార్ తండ్రిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి బస్సులో వెళుతున్న మొగలిని సాయికుమార్ ఫాలో అయ్యి ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద బస్సు దిగగానే వెనకరించి వెళ్లి కత్తితో దాడి చేశాడు. సుమారు 15 కత్తిపోట్లు పొడిచాడు. ఇది గమనించిన స్థానికులు మొగలిని ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ మొగలి చనిపోయాడు. తండ్రి పై కొడుకు నడిరోడ్డుపై దాడి చేసిన దృశ్యాలు అక్కడే ఉన్న సిసి కెమెరాలు రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
■ MOST READ :
-
Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. గద్వాలలో వెలుగులోకి..!
-
BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!
-
Narayanpet : కెసిఆర్, కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్..!
-
Phone : మార్కెట్లోకి మడతలు పెట్టే (Tri Folded) ఫోన్.. 2 in 1 వినియోగం..!
-
Power Shock : కాటేసిన కరెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత..!









