TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండహైదరాబాద్

Hyderabad – Nagarjunasagar : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారి పై పొంచి ఉన్న ప్రమాదం..!

Hyderabad – Nagarjunasagar : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారి పై పొంచి ఉన్న ప్రమాదం..!

చింతపల్లి, మనసాక్షి :

హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారి వెంట చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గ్రామపంచాయతీ వి ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఇటీవల ఒక లారీ కల్వర్టును ఢీ కొట్టడంతో ఆ కల్వర్టు పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో మూలమలుపు వద్ద నాగ సాగర్ హైదరాబాద్ రహదారిపై వాహనదారులకు కూలిన కల్వర్టుతో ఈ ప్రమాదం పొంచి ఉంది. రాత్రి సమయంలో ఎటు ప్రక్క నుండి ఏ వాహనం వస్తుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది.

ముఖ్యంగా ఆటో, ద్విచక్ర వాహనదారులు అటు నుండి వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు .మూల మలుపు వద్ద కల్వర్టు ఉండడంతో మరో ప్రమాదం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాద విషయంపై రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు దృష్టి పెట్టి ప్రమాదం పొంచి ఉన్న కల్వర్టుకు వెంటనే మరమ్మతులు చేయించాలని ద్విచక్ర వాహనదారులు ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.

MOST READ : 

  1. Good News : రూ.1500 చెల్లిస్తే లక్ష రూపాయలు.. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఎప్పుడో..!

  2. Watermelon : పుచ్చకాయ తీసుకుంటున్నారా.. వీటిని చెక్ చేయకపోతే రుచిలేని పండుతో డబ్బులు బొక్క..!

  3. Summer Tours : టూర్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ బడ్జెట్, టాప్ 10 సమ్మర్ టూరిస్ట్ ప్లేసేస్..!

  4. Nalgonda : ధాన్యం కు రూ.500 బోనస్ సద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

మరిన్ని వార్తలు