Food Safety Officers : ఫుడ్ సేఫ్టీ అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలు.. బేకరీ తనిఖీ చేసిన అధికారులు..!
Food Safety Officers : ఫుడ్ సేఫ్టీ అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలు.. బేకరీ తనిఖీ చేసిన అధికారులు..!
రామసముద్రం, మన సాక్షి:
రామసముద్రంలోని ఓ బెకరిలో హనీ కేక్ తిని ఐదుగురు చిన్నారులు అస్వస్థత కు సంఘటనకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారీ షమిం భాషా తన సిబ్బందితో శనివారం రామసముద్రం విచ్చేసి సదరు భేకరిలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా బేకరి లోని పలు రకాల తినుబండారాలను పరిశీలించారు.
బేకరి షాపులో పదార్థాల తయారికి సంబంధించి పరికరాలు, వస్తువుల నాణ్యతను పరిశీలించారు. ఇందులో కొన్ని పదార్థాలను ల్యాబ్ పరిశీలనా నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసుకెళ్ళారు.
ఈ సందర్భంగా షమీమ్ మాట్లాడుతూ వినియోగదారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్థాల అమ్మకం దారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బేకరి లు,హోటళ్ళు, పలు రకాల దుకాణదారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అధికారుల నుండి అనుమతి తీసుకోవాలన్నారు. అలా కాకుండా అపరిశుభ్ర, అనారోగ్య కారకమైన తినుబండారాలను, ఆహారాలను విక్రయిస్తే భదితులపై తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు.









