Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక, ప్రమాణ స్వీకారం..! 

Miryalaguda : నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక, ప్రమాణ స్వీకారం..! 

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవాన్ని మిర్యాలగూడ పట్టణంలోని సుందనగర్ ఆఫీసులో అంగరంగ వైభవంగా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆలగడప గిరిధర్ నాయి, నలగొండ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు నేలపట్ల రమేష్ లు పాల్గొన్నారు.

అనంతరం నూతన అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నుకోబడిన రాయించు నరసింహ, కార్యదర్శి మేడిపల్లి సైదులు, కోశాధికారి రాచమల్ల వెంకన్న లను శాలువాలతో సన్మానించి నియామక పత్రాన్ని అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

నాయి బ్రాహ్మణులు ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏది ఉండదని ఐక్యమతమే మహాబలమన్నారు. ఏదైనా సంఘంలో సమస్యలు ఉన్న తమకు తెలియజేసినట్లయితే తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, వాట్సప్ గ్రూపులలో మెసేజ్ ల ద్వారా సంఘం విషయాలు తెలిప కూడదని,నేరుగా సంఘం ఆఫీస్ కి వచ్చి సంఘం అభివృద్ధి, సంబంధిత విషయాలను వివరించాలన్నారు.

ప్రతి ఒక్కరూ ఈగోలకు పోకుండా సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు సహాయ సహకారాలు అందించాలన్నారు. మన సంఘంను కాపాడుకునే బాధ్యత మన మీదే ఉందని మరోసారి గుర్తు చేశారు. అదేవిధంగా బిల్డింగ్ కమిటీ వారు, నూతనంగా ఎన్నుకోబడ్డ సంఘ సభ్యులు అందరు కలసి తమ యొక్క సంఘ భవనం పూర్తి చేసే అంతవరకు అందరూ సమన్వయంతో ముందుకు నడిచి సంఘం యొక్క బిల్డింగ్ ని నిర్మించాలని కోరారు.

నూతన బిల్లింగ్ కమిటీ అందరి సహకారంతో బిల్డింగ్ ని నిర్మించి అన్ని విధాల సౌకర్యాలతో నాయి బ్రాహ్మణుల ఐక్యత చాటి చెప్పే విధంగా భవన నిర్మాణం జరుగుతుందన్నారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు అందరూ నూతన కార్యవర్గం ఎన్నుకోబడ్డ వారి సూచనల మేరకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలన్నారు.

అనంతరం నూతన కమిటీ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించి, నూతన కార్యవర్గమునకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కృష్ణ మూర్తి, మాజీ గౌరవ అధ్యక్షులు కేతేపల్లి యాదగిరి, జంపాల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు హనుమంతు, గోలి యాదగిరి, నాగబెల్లి యాదగిరి, జజాల శ్రీను, నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు,సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : భరోసాపై రైతన్నలకు శుభవార్త.. ఖాతాల్లోకి నగదు ఇప్పుడే.. లేటెస్ట్ అప్ డేట్..!

  2. Gold Price : గోల్డ్ మళ్లీ డమాల్.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. Gold Offers : అక్షయ తృతీయకు అదిరిపోయే బంగారం ఆఫర్లు.. తెలుసుకోండి ఇవే..! 

  4. Flash.. Flash : యాదాద్రి పవర్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..!

మరిన్ని వార్తలు