జాతీయంBreaking News

Kalpataru: కల్పతరు ప్రాజెక్ట్స్‌కు రూ.2,372 కోట్ల రూపాయల కొత్త ఆర్డర్లు..!

Kalpataru: కల్పతరు ప్రాజెక్ట్స్‌కు రూ.2,372 కోట్ల రూపాయల కొత్త ఆర్డర్లు..!

ముంబై, మన సాక్షి :

విద్యుత్, మౌలిక వసతుల రంగంలో ప్రముఖ ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థ అయిన కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (కేపీఐఎల్) తన అంతర్జాతీయ అనుబంధ సంస్థలతో కలిసి సుమారు 2,372 కోట్ల రూపాయల విలువైన కొత్త ఆర్డర్లను, అవార్డు నోటిఫికేషన్లను పొందింది.

కొత్త ఆర్డర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

– భారతదేశం, విదేశాల్లో విద్యుత్ ప్రసారం, పంపిణీ (టీఅండ్‌డీ) వ్యాపారంలో ఆర్డర్లు
– భారతదేశంలో భవనాలు, కర్మాగారాల (బీఅండ్‌ఎఫ్) వ్యాపారంలో ఆర్డర్లు

కేపీఐఎల్ ఎండీ, సీఈఓ మనీష్ మోహ్నోట్ మాట్లాడుతూ.. “2026 ఆర్థిక సంవత్సరాన్ని టీఅండ్‌డీ, బీఅండ్‌ఎఫ్ వ్యాపారాల్లో ముఖ్యమైన ఆర్డర్లతో సానుకూలంగా ప్రారంభించాం. టీఅండ్‌డీ ఆర్డర్లు భారత్, నార్డిక్ దేశాలు, మధ్యప్రాచ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈపీసీ మార్కెట్లలో మా స్థానాన్ని బలోపేతం చేస్తాయి.

బీఅండ్‌ఎఫ్ వ్యాపారంలో పొందిన ఆర్డర్లు ప్రముఖ డెవలపర్ల నుంచి వచ్చిన పునరావృత ఆర్డర్లు. ఇవి సకాలంలో పూర్తి, నాణ్యతకు మా బలమైన రికార్డు ఆధారంగా లభించాయి. బలమైన వ్యాపార అవకాశాలు, స్థిరమైన అమలు సామర్థ్యాలతో విద్యుత్ ప్రసారం, సివిల్ వ్యాపారాల్లో అభివృద్ధి పట్ల మేం ఎంతో ఆశాజనకంగా ఉన్నాం” అని తెలిపారు.

MOST READ : 

  1. TG News : భూ భారతి ఫైలెట్ మండలాలే రాష్ట్రానికి దిక్సూచి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..!

  2. Health : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన..! హెల్త్ కేర్ పై ప్రభుత్వం దృష్టి..!

  3. Fake PassPort ; నకిలీ పాస్ పోర్టులతో విదేశి ప్రయాణానికి యత్నం.. పోలీసుల అదుపులో ఐదుగురు..!

  4. Nalgonda : నల్గొండ జిల్లాలో దొంగల బీభత్సం..!

  5. Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

మరిన్ని వార్తలు