క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..!
Miryalaguda : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం షాక్ నగర్ కు చెందిన పొట్లూరి అలివేలు ఆమె తల్లి యశోదతో కలిసి గుంటూరుకు వెళ్ళి మిర్యాలగూడకు లారీలో వస్తున్నారు.
మిర్యాలగూడ మండలం కిస్టాపురం గ్రామ సమీపంలోకి రాగానే డ్రైవర్ లారీ ఆపి బహిర్భూమికి వెళ్ళాడు. కాగా ఆ సమయంలో అలివేలు ఆమె తల్లి యశోద మూత్ర విసర్జన కోసం లారీ దిగి రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొని అలివేలుకు అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









