Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : అసంపూర్తి డ్రైనేజీ.. మిర్యాలగూడలో రోడ్లపై మురుగు నీరు..!

Miryalaguda : అసంపూర్తి డ్రైనేజీ.. మిర్యాలగూడలో రోడ్లపై మురుగు నీరు..!

మన సాక్షి, మిర్యాలగూడ :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రోడ్లపై మురుగునీరు పారుతుంది. కొద్దిపాటి వర్షం వచ్చినా.. మురుగు కాలువలోని నీరంతా రోడ్లపైకి చేరుతుంది. అసంపూర్తిగా డ్రైనేజీ నిర్మాణ పనులు కావడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. పట్టణంలోని సాగర్ రోడ్డులో నిర్మాణం అవుతున్న డ్రైనేజీ అసంపూర్తిగా ఉంది.

కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారి వెంట సాగర్ రోడ్డులో నిర్మించిన డ్రైనేజీ అసంపూర్తిగా ఉంది. నిర్మాణం పూర్తికాకముందే బస్టాండ్ తో సహా మిగతా చోట్ల మురుగు కాలువలు ప్రధాన డ్రైనేజీలో కలిపారు. దాంతో చిన్నపాటి వర్షం వచ్చినా మురుగు నీరు అంతా వాసవి భవన్ రోడ్ లో నిలిచిపోతుంది.

వాసవి భవన్ రోడ్డు వరకు నిర్మించిన డ్రైనేజీ వర్షపు నీటితో నిండి.. అక్కడి నుంచి రోడ్డు మీదికి చేరుతుంది. ఆ రోడ్లని మురుగు నీరు, చెత్తాచెదారం తో నిండాయి. రోడ్లపై దుర్వాసన వెదజల్లుతుంది. ఈ విషయంపై స్థానికులు మున్సిపల్, ఆర్ అండ్ బి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఉన్నతాధికారులు దృష్టి సారించి డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.

MOST READ :

  1. Rythu Bharosa : రైతు భరోసా పై బిగ్ అప్డేట్.. ఈ పత్రాలు తప్పనిసరి..!

  2. TG News : రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.8 వేలు..!

  3. Paddy : పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ..  రైతులను ఆకర్షిస్తున్న మెట్టవరి సేద్యం..!

  4. Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!

మరిన్ని వార్తలు