TOP STORIESBreaking Newsటెక్నాలజీహైదరాబాద్

Croma : క్రోమా బ్యాక్ టు క్యాంపస్ సేల్.. ల్యాప్‌టాప్‌లు రూ.28,990..!

Croma : క్రోమా బ్యాక్ టు క్యాంపస్ సేల్.. ల్యాప్‌టాప్‌లు రూ.28,990..!

హైదరాబాద్, మన సాక్షి :

ఆధునిక విద్యలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ అనుబంధ క్రోమా, దేశంలోని విశ్వసనీయ ఎలక్ట్రానిక్స్ రిటైలర్, ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’ ప్రకటించింది. విద్యార్థులను, టెక్ ప్రియులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ విక్రయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. డిజైనర్లు, ఏఐ కోడర్లు, నెక్స్ట్-జెన్ గేమర్లు ఎవరైనా సరే, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఉపకరణాలపై క్రోమా అద్భుతమైన డీల్‌లు అందిస్తోంది.

ధరలు విద్యార్థులకు ఎంతో అనుకూలం. ఈ ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’ విద్యా, సృజనాత్మక భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టేందుకు అద్భుత అవకాశం. అగ్రశ్రేణి బ్రాండ్‌లు, సున్నా వడ్డీ ఈఎంఐలు, క్యాష్‌బ్యాక్, ప్రత్యేక విద్యార్థి ప్యాకేజీలు ఇక్కడ లభిస్తాయి. ప్రముఖ ఆఫర్‌లలో కొన్ని:

మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2: రూ. 46,390 నుంచే ప్రారంభం. దీనికి విద్యార్థి డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 5జీ: నెలకు కేవలం రూ.3,849 చెల్లింపుతో సొంతం చేసుకోవచ్చు. ఇది లెక్చర్‌లు, బహుళ పనులు, వినోదానికి అనుకూలం.

ఏఐ విండోస్ ల్యాప్‌టాప్‌లు: రూ.55,990 నుంచే లభిస్తాయి. వీటితో రూ.6,899 విలువ చేసే పూర్తి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉచితం. 24 నెలల వరకు సున్నా వడ్డీ ఈఎంఐ, రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ ఉంటాయి.

క్రోమాకు దేశవ్యాప్తంగా 200 నగరాల్లో 560 స్టోర్‌ల విశాల నెట్‌వర్క్ ఉంది. మెట్రో, టైర్-2 నగరాల విద్యార్థులు ప్రత్యేక ప్యాకేజీలు, డిస్కౌంట్‌లు పొందవచ్చు. హైదరాబాద్ మెట్రోలో ఇంటెల్ ఐ5 ల్యాప్‌టాప్‌లు రూ.47,990 నుంచే ప్రారంభం. ఎక్స్ఛేంజ్‌తో పాటు కీబోర్డు-మౌస్ కాంబో, యాంటీవైరస్, నాయిస్ విక్టర్ వాచ్ (రూ.2,499 విలువ) ఉచితం. దేశవ్యాప్తంగా రైజెన్ 3 ల్యాప్‌టాప్‌లు రూ.28,990 నుంచే లభిస్తాయి. వినియోగదారులు పూర్తి ఆఫర్ల కోసం తమ సమీప క్రోమా స్టోర్‌ను సందర్శించవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా షాపింగ్ చేయవచ్చు.

MOST READ : 

  1. Applications : రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం దరఖాస్తులకు గడువు పొడిగింపు..!

  2. Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్ళు.. నాగార్జునసాగర్ కు జలకళ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. UPI : యూపీఐ పేమెంట్స్ లో సరికొత్త విప్లవం.. ఆశ్చర్యం కల్పించే విధంగా లావాదేవీలు..!

  4. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు