Hareesh Rao : మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణ.. అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్..!

Hareesh Rao : మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణ.. అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ పార్టీది రాష్ట్రంలో 50 ఏళ్లుగా అబద్ధాలు, మోసాలేనని ఆయన అన్నారు. జస్టిస్ చంద్ర గోష్ నేతృత్వంలోని కాలేశ్వరం కమిషన్ ను కలిసేందుకు ఆయన బి.ఆర్.కె భవన్ కు వెళ్లారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఆరు సార్లు క్యాబినెట్ లో ఆమోదం జరిగిందని, అసెంబ్లీలో మూడు సార్లు ఆమోదించినట్లు ఆయన పేర్కొన్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కమిషన్ కు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. కృష్ణ నీళ్ల కేటాయింపులో తెలంగాణకి 299 టీఎంసీలు బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకాలు పెట్టిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు.
నీటి పంపకాలను ట్రిబ్యునల్ చేస్తుందని, రాష్ట్రాలకు నీటి వినియోగాన్ని కేఆర్ ఎంబి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి పరిమితమైతే.. నీటి పంపకాలనేది శాశ్వతం అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పాలకులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతకాని నేతల వల్ల 299 టీఎంసీలు నీరు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
కెసిఆర్ శాశ్వత ఒప్పందం చేసి ఉంటే సెక్షన్ 3 గురించి రాష్ట్రం ఏర్పడిన 42 రోజులకే ట్రిబ్యులకు ఎందుకు లేఖ రాస్తారని కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్దాలేనని, 50 ఏళ్లుగా కాంగ్రెస్ అబద్ధాలు మోసాలు అని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 50 ఏళ్లుగా చేసిన మోసాలకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని సెటైర్ వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి :
-
Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. వరుస సెలవులు..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో పోలీస్ స్టేషన్ కు చేరిన కోడి పంచాయితీ.. సోషల్ మీడియాలో వైరల్..!
-
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!
-
Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్ళు.. నాగార్జునసాగర్ కు జలకళ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Croma : క్రోమా బ్యాక్ టు క్యాంపస్ సేల్.. ల్యాప్‌టాప్‌లు రూ.28,990..!
-
TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!









