Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఉద్యోగంBreaking Newsతెలంగాణ

TG New : ఆ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

TG New : ఆ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆ ఉద్యోగులకు సర్వీస్ ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త అందించింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద పనిచేస్తున్న వారికి సర్వీస్ పొడినించింది. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని ఆందోళన పరిస్థితుల్లో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భరోసా కల్పించింది.

తెలంగాణలోని 51, 451 ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులుకు సర్వీస్ ను 2026 మార్చి వరకు పొడిగించింది. ఈ ఏడాది మార్చి నెల వారకే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గడువు ముగిసింది. కాగా మూడు నెలలుగా సర్వీస్ పడగింపు పై స్పష్టత లేకపోవడంతో వేలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందారు. తాజాగా ప్రభుత్వం వారి సర్వీస్ ను రెన్యువల్ చేసి తాత్కాలికంగా ఊరట కల్పించింది.

అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద పని చేస్తున్న 1500 మంది ఉద్యోగుల సర్వీసులు కూడా మరో ఏడాది పాటు పొడిగించింది. NHM కింద వివిధ పథకాల్లో పనిచేస్తున్న మరో 1760 మంది ఉద్యోగులకు కూడా పదవి ఉద్యోగ గడువును ఏడాది పాటు పొడిగించింది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు తాత్కాలిక భరోసా ఇచ్చినప్పటికీ దీర్ఘకాలిక , స్పష్టమైన విధానం అవసరమని ఉద్యోగస్తులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు, పర్మినెంట్ డిమాండ్  ఎంతో కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

MOST READ : 

  1. TG News : రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా.. ఎందుకో తెలుసా..!

  2. Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

  3. ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!

  4. TG News : యూరియా, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!

  5. Obesity: అన్నం తింటే బరువు పెరుగుతారా.. నిజమిదే తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు