తెలంగాణBreaking Newsవ్యవసాయం

Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..! 

Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..! 

పెన్ పహాడ్, మన సాక్షి:

ప్రభుత్వం సన్న చిన్న కారు రైతులకు అతి భారీ శుభవార్త తెలియజేసింది. సబ్సిడీ పైన వారికి షెడ్ల నిర్మాణానికి రుణాలను అందించనున్నది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..

సన్న చిన్న కారు రైతులకు పశువుల షెడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని మండల పశు వైద్యాధికారి అనంతుల వెంకన్న తెలిపారు. పాడి రైతన్నల అభ్యున్నతి కొరకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా పాడి రైతులకు పశువుల షెడ్ నిర్మాణానికి సబ్సిడీ అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

పశువుల కు ఎండ, వానలకు రక్షణ కల్పించడానికి ఇది చక్కని అవకాశం గా ఉపయోగపడే విధంగా ఈ పథకం కింద 85 వేల నుండి 90 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని ఆయన తెలిపారు.

షెడ్ నిర్మాణంలో బేస్మెంట్, లింటెల్, రూప్ లెవెల్ స్థాయిలు ఉంటాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈజీఎస్ అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శి లబ్ధిదారులకు అందజేస్తారు. కొన్నిచోట్ల పాడి రైతులు పెట్టుబడి పెట్టి షెడ్డు నిర్మించాలంటే ఆర్థిక స్థోమత లేక వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుందని తెలిపారు.

పాడి రైతులకు NREGS జాబ్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలని, ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. గ్రామపంచాయతీ నుండి అనుమతి పత్రం, పశు వైద్యాధికారి నుండి పశువులు కలిగి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండి. ధ్రువీకరణ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేసి రాయితీని పొందాలని ఆయన తెలిపారు.

రైతు సోదరులు పశువుల షెడ్ల నిర్మాణం
సద్వినియోగం చేసుకోవాలని మండల పశు వైద్యాధికారి అనంతుల వెంకన్న తెలిపారు.
ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని. ధ్రువీకరణ పత్రాలను సమకూర్చుకొని సంబంధిత అధికారులకు అందజేయాలని మండల పశు వైద్య అధికారి అనంతుల వెంకన్న కోరారు.

By : Nageshwar Rao, Penpahad 

MOST READ : 

  1. TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!

  2. TG News: ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. వారికి భరోసా, భీమా పథకములకు దరఖాస్తు స్వీకరణ..!

  3. Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)

  4. Baba Vanga : బాబా వంగా చెప్పింది నిజమే.. 2025లో ఏం జరగబోతోంది..!

  5. TG News : తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత షురూ.. వారి కార్డులు కట్..!

మరిన్ని వార్తలు