Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు..!

జగిత్యాల, (మన సాక్షి)

జగిత్యాల జిల్లా కేంద్రంలో మన గ్రోమోర్ దుకాణంలో ఎరువుల సరఫరా పై జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఎరువుల విక్రయాలకు సంబంధించినన రికార్డులను పరిశీలించారు. ఎరువుల దుకాణం ముందు సూచిక బోర్డు తప్పనిసరి ఉంచాలని, సూచిక బోర్డుపై ఎరువులు మందులు మరియు విత్తనాలు ధరల పట్టిక లో ధరలు రాయాలని, రైతులకు సరైన ధరలకు అమ్మాలని సూచించారు.

అదే విధంగా రైతులకు ఎరువులు విత్తనాలు నాణ్యతమైనవి అందించాలని, కాలం చెల్లిన (ఎక్స్ పైర్ ) మందులను రైతులకు అమ్మ రాదని పేర్కొన్నారు. ఎరువులు మరియు స్ప్రే మందులు సరైన ధరలకు అమ్మాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ఒక ఎకరానికి ఎంత ఎరువులు వేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. నాణ్య మైన మందులు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.

దుకాణదారు యజమానులు రైతులకు నాణ్యతలేని ఎరువుల మందులు, విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్, మండల అధికారి ఏవో వినీల మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

  2. Attendance : ప్రజెంట్ సార్.. సీఎం ఫోటోతో పంచాయతీ కార్యదర్శి.. అధికారుల పరిశీలనలో వెలుగులోకి..!

  3. Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..! 

  4. TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!

మరిన్ని వార్తలు