Dost : దోస్త్ ద్వారా రేపు డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..!

Dost : దోస్త్ ద్వారా రేపు డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..!
జగిత్యాల, (మన సాక్షి) :
2025 – 2026 విద్యా సంవత్సరానికిగాను జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీ.ఏ, బీ.కాం కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయటానికి “దోస్త్” ద్వారా “స్పాట్” అడ్మిషన్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
కళాశాల ఉన్నత విద్యా కమిషనర్ ( సీ సీ ఈ) అల్లం రాజు దేవసేన, డిగ్రీ కళాశాల సీ సీ ఈ కార్యాలయం సంయుక్త సంచాలకులు ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్ర సింగ్, ప్రొఫెసర్ డాక్టర్ పీ.బాల భాస్కర్ లు జారీ చేసిన సూచనల మేరకు..
ఇంటర్మీడియెట్ తో పాటు తత్సమానమైన అర్హత గల కోర్సులలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే “దోస్త్” ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంటూ, ఇప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్ల కోసం “దోస్త్ ” ద్వారా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు మాత్రమే అర్హులని, వారు ఈ నెల 15,16 తేదీలలో “దోస్త్” ద్వారా స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, అందుకోసం మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని ఆయన గుర్తు చేశారు.
కొత్తగా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మాత్రం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక జిరాక్స్ సెట్ కాపీలను కళాశాలలో సమర్పించవలసి ఉంటుందని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య విద్యార్థులకు సూచించారు.
రిజర్వేషన్ల ఆధారంగా మాత్రమే ఈ సీట్లను భర్తీ చేస్తామని గుర్తు చేస్తూ, ఈ స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమంలో దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు మాత్రం స్కాలర్ షిప్స్ మంజూరు కావని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
ఇప్పటి వరకు నాలుగు దశల్లో “దోస్త్” ద్వారా డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయ్యిందని, ఇదే చిట్టచివరి అవకాశమని అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య విలేకరులకు పంపిన ఒక ప్రకటనలో విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.
MOST READ :
-
Urea : యూరియా కోసం సొసైటీ కార్యాలయం వద్ద క్యూలో వందలాది మంది రైతులు..!
-
Big Twist : పట్టపగలు దారిదోపిడిలో బిగ్ ట్విస్ట్.. ఏడుగురి అరెస్ట్..!
-
TG News : పట్టపగలు దారి దోపిడీ.. కళ్ళల్లో కారం కొట్టి రూ.40 లక్షలు చోరీ..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులో అలా చేయాలి..!









