తెలంగాణBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలు

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. వారి దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. వారి దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి..!

కరీంనగర్, మనసాక్షి :

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వేగవంతంగా పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానంతరం జిల్లా అధికారులతో పలు అంశాలపై సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 2021 ఫిబ్రవరి నుండి 27 వేల 580 దరఖాస్తులు రాగా 1810 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అన్నారు. కోర్టు కేసుల వంటి కారణాలతో పరిష్కరించలేని ఇలాంటి దరఖాస్తులపై అర్జీదారుకు సమాచారం ఇస్తూ ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. వివిధ విభాగాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై సమీక్షించారు.

ఎక్కువ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ శాఖ అధికారులు ఈ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కరించిన దరఖాస్తులను ఆన్లైన్ లో విధిగా నమోదు చేయాలని అన్నారు.

ప్రజావాణి కి 387 దరఖాస్తులు

ప్రజావాణి లో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. 387 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు.

పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమేష్ బాబు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Karimnagar : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..!

  2. Alumni : 34 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!

  3. Kiledi : వారు మహా కిలేడీ లు..!

  4. Dost : దోస్త్ ద్వారా రేపు డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..!

మరిన్ని వార్తలు