Breaking Newsజాతీయంరాజకీయం
సీఎం కేసీఆర్ జాతీయ పర్యటన షెడ్యూల్ – latest news
సీఎం కేసీఆర్ జాతీయ పర్యటన షెడ్యూల్ – latest news
హైదరాబాద్, మనసాక్షి : జాతీయ స్థాయి రాజకీయాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి పర్యటించనున్నారు.
పర్యటన వివరాలు :
- శుక్రవారం (20వ తేదీ) మద్యాహ్నం డిల్లీ లోని ఆర్ధికవేత్తలతో సమావేశమవుతారు. అదే విధంగా జాతీయ మీడియాతో సమావేశమవుతారు.
- ఈ నెల 22వ తేదీన మద్యాహ్నం డిల్లీ నుంచి ఛంఢీఘర్ పర్యటను వెళ్తారు. గతంలో రైతుల ఉద్యమంలో అసువులు బాసిన 600 మంది రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ఆర్దిక భరోసాగా ఒక్కొక్క రైతు కుటుంబానికి మూడు లక్షల రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తారు. డిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌సింగ్‌తో కలిసి చెక్కులు పంపిణీ చేస్తారు.
- ఈ నెల 26వ తేదీన ఉదయం బెంగళూరు పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశం కానున్నారు.
- ఈ నెల 27న రాలేగావ్ సిద్ది పర్యటించనున్నారు. ప్రముఖ ఉద్యమ కారుడు అన్నా హజారేతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి షిరిడి వెళ్లి సాయి బాబాను దర్శించుకుంటారు. అనంతరం పర్యటన ముగించుకొని హైదరబాద్ చేరుకుంటారు.
- అదే విధంగా ఈ నెల 29,30వ తేదీలలో బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. గాల్వాన్ లోయలో అసువులు బాసిన వీర జవాన్‌ల కుటుంబాలను పరామర్శిస్తారు. గతంలో ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను కేసీఆర్ ఆదుకోనున్నారు.









