మోటర్ల కేబుల్ చోరీలో… ప్రకాష్ నగర్ కు చెందిన ఇద్దరి అరెస్ట్ – latest news
మోటర్ల కేబుల్ చోరీలో…
ప్రకాష్ నగర్ కు చెందిన ఇద్దరి అరెస్ట్
మిర్యాలగూడ మే 18, మనసాక్షి : చెడు వ్యసనాలకు బానిసలై చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి నిందితులను బుధవారం మిర్యాలగూడ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ ఎస్సై నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం…
మండలంలోని ఐలాపురం గ్రామ శివారులో ఎం ఎస్ పి కాలవ కట్టపై పై గల కరెంటు మోటార్లు యొక్క కేబుల్ వైర్ లను దొంగిలించిన ఇద్దరు నేరస్తులను నందిపాడు వద్ద ఎస్సై నరసింహులు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి పది వేల రూపాయలు, ఫ్యాషన్ ప్రో బండి రికవరీ చేయనైనది. నిందితులు ఎర్ర బోలా రవి, మేడ నారాయణ మిర్యాలగూడ ప్రకాష్ నగర్ కు చెందిన వారుగా గుర్తించారు . గత రెండు సంవత్సరాలుగా చెడు అలవాట్లకు బానిసై ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిని రిమాండ్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించే నైనదని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
1. మిర్యాలగూడలో డెకరేషన్ బ్లేడుతో దాడి , నలుగురిపై కేసు నమోదు
2. BREAKING : తేనెటీగల దాడితో బిజెపి కార్యకర్త సొప్పరి సందీప్ మృతి
3. BREAKING : వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి









