TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : 22 ఏళ్లు దేశ రక్షణలో విధులు.. గ్రామానికి సేవ చేసేందుకు సర్పంచ్ బరిలో..!

Suryapet : 22 ఏళ్లు దేశ రక్షణలో విధులు.. గ్రామానికి సేవ చేసేందుకు సర్పంచ్ బరిలో..!

పెన్ పహాడ్, మన సాక్షి:

పారా మిలిటరీలో 22 సంవత్సరములు విధులు నిర్వహించి వాలంటర్ రిటైర్మెంట్ పొందిన పెన్ పహాడ్ మండలంలోని నాగుల పహాడ్ గ్రామానికి చెందిన ఏపూరి నగేష్ గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగుల పహాడ్ గ్రామానికి చెందిన ఏపూరి నగేష్ నాగులపాడు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

తనను గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని డ్రైనేజీ కాలువలు, వీధి దీపాలు, ప్రజలకు వైద్య సేవలకు పల్లెదోవకాన నిర్మాణం, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ప్రజలకు తెలియపరుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

పారా మిలిటరీలో బాధ్యతగా విధులు నిర్వహించిన దేశం కోసం సేవ చేసిన విధంగానే నాగుల పహాడ్ గ్రామానికి కూడా సేవ చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ నేను గ్రామంలో కూడా బాధ్యతగా ప్రజలకు సేవ చేస్తానని ఆయన ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను వేడుకుంటూ ప్రజలకు పలు రకాల హామీ ఇస్తు ప్రచారం నిర్వహిస్తున్నారు.

MOST READ 

  1. TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!

  2. Sarpanch Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. తొలివిడతలో ఏకగ్రీవాలు అన్ని వందలా..!

  3. CM Revanth Reddy : ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీగా ఉస్మానియా.. సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

  4. ACB : రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!

మరిన్ని వార్తలు