Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Nalgonda : మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాను జల్లడ పట్టిన నల్గొండ సిసిఎస్ పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాక్..!

15 రోజుల పాటు మధ్యప్రదేశ్ థార్ జిల్లాను జల్లెడపట్టి అంతరాష్ట్ర థార్ గ్యాంగ్ దొంగల ముఠా సభ్యుడిని నల్లగొండ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు.

Nalgonda : మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాను జల్లడ పట్టిన నల్గొండ సిసిఎస్ పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాక్..!

నలగొండ,, మన సాక్షి :

15 రోజుల పాటు మధ్యప్రదేశ్ థార్ జిల్లాను జల్లెడపట్టి అంతరాష్ట్ర థార్ గ్యాంగ్ దొంగల ముఠా సభ్యుడిని నల్లగొండ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు.  శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిందితుడి వద్ద నుండి దొంగలించిన 85 లక్షల విలువగల ఇంటాక్ట్ ప్రాపర్టీ 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ముఠాలోని ఐదుగురు అలవాటు పడిన నేరస్తులని గతంలో ఆంద్రప్రదేశ్,మహారాష్ట్ర మద్యప్రదేశ్ రాష్ట్రం లలో నిందితులు దొంగతనాలు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్నమిగితా నేరస్తులను కూడా అతి త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

గత నెల 5వ తేదీన చిట్యాల పోలీసు స్టేషన్ పరిధి లో ఎన్ ఎల్ 01 బి 2 2756 నెంబరు గల బస్సులో భారీ మొత్తం లో బంగారు ఆభరణాల చోరీ జిల్లా లో సంచలనం సృస్టించినదని దీనిని సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ , హైవే ల వెంట ధాబాల వద్ద ఆగి ఉన్న బస్సులను లక్ష్యంగా చేసుకొని ప్రయాణికుల బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న ముఠాలను అదుపులోనికి

తీసుకొవాలని రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక బృందాలు సి‌సి‌ఎస్, ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి పర్యవేక్షణలో కేసును ఛేదించటానికి వివిధ ప్రాంతాలలో పర్యటించి ఎటువంటి ఆధారాలు లభించని కేసును అత్యదునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇట్టి నేరానికి పాల్పడినది మధ్యప్రదేశ్ రాష్ట్రం థార్ జిల్లా కు చెందిన అలవాటుపడిన నేరాస్తులుగా గుర్తించినారు.

 

తదుపరి జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఇట్టి రెండు ప్రత్యేక బృందాలను మధ్యప్రదేశ్ రాష్ట్రనికి పంపామని ఇట్టి ప్రత్యేక బృందాలు 15 రోజుల పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలలో పర్యాటించి అత్యదునిక సాంకేతిక పరిజ్ఞానం తో నేరస్తులపై ప్రతెక నిఘా ఉంచి మధ్యప్రదేశ్ రాష్ట్రం మనవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్భాన్ క్రాస్ రోడ్డు వద్ద ఒక నింది తుదడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా, అతడు తన సహచరులు అష్రఫ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, జాబర్ ఖాన్, ఉమర్ ఖాన్లతో కలిసి పైన పేర్కొనబడిన నేరాన్ని చేసినట్టుగా అంగీకరించినట్లు తెలిపారు.

గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో హైవేలపై ప్రయాణించే బస్సులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. విచారణలో భాగంగా గతంలో కూడా ఇట్టి ముఠా 2022 మరియు 2023 సంవత్సరం లో కూడా విజయవాడ హైవే పై ఇవే ప్రదేశాలలో హోటల్ ల వద్ద ఆగి ఉన్న బస్సు నుండి భారీ మొత్తంలో డబ్బులను మరియు బంగారు ఆభరణాలను దొంగలించి నట్టు తెలిపినాడు. ఇట్టి నిడితుదిని మునవ్వర్ న్యాయస్థానం నందు హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ పై జిల్లాకు తీసుకోరవడం జరిగినది.

నిందితుడి వద్దనుండి రూ.85 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి ముఠా సభ్యులను గతంలో చేసిన పాతనేరాలను వెలికితీసి సమగ్ర విచారణ కై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగినదన్నారు. పట్టుబడిన నిందితుడు
షా అల్లా రఖా ఖల్ఘాట్ గ్రామం, ధర్మపురి తాలూకా, ధార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం అని తెలిపారు.

ఇట్టి ముఠా సభ్యులను సి‌సి‌ఎస్, ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి పర్యవేక్షంలో పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన, చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ,సి.సి.ఎస్ ఎస్ఐ శివ కుమార్, సి.సి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, పుష్పగిరి, నాగరాజు, కానిస్టేబుల్స్ వెంకటేష్, సాయికుమార్ , జూనేద్ , శివరాజు, మహేశ్, కమల్ కిశోర్. చిన్న బాబు మరియు ఇతర సి‌సి‌ఎస్ సిబ్బందిని జిల్లా ఎప్.పి. ప్రత్యేకంగా అభినందించి రివార్డును ప్రకటించారు.

MOST READ NEWS 

  1. Karimnagar : సిపి తీవ్ర హెచ్చరిక.. చైనీస్ మాంజా విక్రయించినా, వాడినా కఠిన చర్యలు..!

  2. TG News : కొత్త వాహనాలు కొనేవారికి శుభవార్త.. ఇక ఆర్టిఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు..!

  3. BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీబీఏ విద్యార్థులు మృతి..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..!

మరిన్ని వార్తలు