Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

రాష్ట్రవ్యాప్తంగా రైతులు.. రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి వరి నాట్లు ముగిశాయి. కానీ ఇప్పటివరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాలేదు.

Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రవ్యాప్తంగా రైతులు.. రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి వరి నాట్లు ముగిశాయి. కానీ ఇప్పటివరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాలేదు. సంక్రాంతి పండుగకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని ఆశతో ఎదురు చూశారు. కానీ రైతు భరోసా గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సంక్రాంతికి నిధులు విడుదల చేయలేదు.

ఇది ఇలా ఉండగా జనవరి నెల ఆఖరు నాటికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా నిధులు పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే విడుదల చేయాలని కచ్చితంగా నిర్ణయించింది. ఈ మేరకు శాటిలైట్ ద్వారా పంటల వివరాలను సేకరిస్తుంది.

అయితే శాటిలైట్ మ్యాపింగ్ పూర్తి అయిన తర్వాతనే రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో రైతు భరోసా ఇవ్వడానికి శాటిలైట్ మ్యాపింగ్ పూర్తి కావాలంటే సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దాంతో రైతు భరోసా ఫిబ్రవరి లేదా మార్చిలో అందే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : 

  1. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

  2. Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!

  3. Cyber Crime : రూ.5 వేలు ఇచ్చారు.. రూ.2.9 కోట్లు కొట్టేశారు..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు