Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsతెలంగాణ

BIG BREAKING : 8 మంది మావోయిస్టుల లొంగుబాటు..! 

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట 08 మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ మావోయిస్టులు లొంగిపోయారు.

BIG BREAKING : 8 మంది మావోయిస్టుల లొంగుబాటు..! 

గోదావరిఖని, మన సాక్షి :

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట 08 మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురుదల సభ్యులు ఐదుగురు మిలిషియా సభ్యులు ఉన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యం గ్రామానికి చెందిన ధర్మాజీ శ్రీకాంత్, చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన పోడియం కాములు, ముడియం జోగ, కుజం లెక్కే, మోదం భీమ, కుంజం ఉంగా, ముడియం సక్రం లు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు, పునరావాసం కింద ఒక్కో మావోయిస్టు కు 25 వేల రూపాయలు సహాయం అందించారు.

మావోయిస్టులు జనజీవ స్రవంతిలోకి రావాలి – 
రామగుండం సీపీ

అజ్ఞాతములో ఉన్న మావోయిస్టులను జన జీవన స్రవంతి లోకి రావాలని రామగుండం సీపీ పిలుపునిచ్చారు. మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని, తెలంగాణ అభివృద్దికి తోడ్పడాలని కోరారు. అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం వారికి అన్నీవిధాల తోడ్పాటు, లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి రామగుండం కమిషనరేటు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్స్పెక్టర్ లు రాజేంద్ర ప్రసాద్, భీమేష్, ఆర్ ఐ శేఖర్, ఆర్ ఎస్ ఐ లు వెంకట్, శివ, తదితరులు పాల్గొన్నారు.

By : Shankar , Godavarikhani 

MOST READ 

  1. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  2. Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

  3. Suryapet : సూర్యాపేట పోలీసులు ఎఫ్ ఐ ఆర్ ఎట్ డోర్ స్టెప్ నూతన కార్యక్రమం.. బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరణ..!

  4. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

మరిన్ని వార్తలు