Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

BREAKING : నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి..!

ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా.. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

BREAKING : నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి..!

ఊరుకొండ, మన సాక్షి

ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా.. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి కుమార్తె సిరి (14) కుమారుడు హిమాన్షు (11) , శ్రీకాంత్ రెడ్డి సోదరి కుమార్తె స్నేహ (15) హైదరాబాదులో చదువుతున్నారు.

సెలవులు ఉండడంతో తమ సొంత గ్రామానికి వచ్చారు. ఆదివారం పిల్లలు అందరూ శ్రీకాంత్ రెడ్డి తో గ్రామానికి సమీపంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి అనే రైతు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో హిమాన్షు వ్యవసాయ పొలంలో ఉన్న నీటి గుంత వద్ద సెల్ఫీ దిగబోయి నీటిలో పడిపోయాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో సిరి, నేహా సైతం నీటి గుంటలో పడిపోయారు.

అక్కడే ఉన్న వేణుగోపాల్ రెడ్డి కుమార్తె విద్యాధరణి పిల్లలను కాపాడే ఆందోళనలో గోతిలో కాకుండా.. పక్కన లోతు తక్కువగా ఉన్నచోట పడిపోయింది. అరుపులు విని పక్క పొలంలో పనిచేస్తున్న రాణి అనే మహిళ పరుగు పరుగున వచ్చి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న విద్యాధరిణి ని బయటకు తీసింది. పిల్లలు ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్న ఈతరానీ శ్రీకాంత్ రెడ్డి విలవిలలాడాడు.

అప్పటికే విషయం చుట్టుపక్కల వారి ద్వారా గ్రామస్తులకు తెలియజేయడంతో అందరూ కూడా చేరి నీటి గుంటలో పడి ప్రాణాలను కోల్పోయిన వారిని వెతికి బయటకు తీశారు. ఒకేరోజు ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

MOST READ 

  1. MARATHON : మారథాన్‌ – 2026లో ప్రతిభ.. డీఎస్పీనీ అభినందించిన ఎస్పీ..!

  2. Ideal Marriage : ఐఏఎస్, ఐపిఎస్ యువ జంట ఆదర్శ వివాహం.. సాదా సీదాగా రిజిస్టర్ మ్యారేజ్..!

  3. Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!

  4. Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

మరిన్ని వార్తలు