TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో అన్నపూర్ణ అభయ హస్తం.. రూ.5 భోజనం ఏర్పాటు..!

మిర్యాలగూడ పట్టణంలో అతిత్వరలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతీ పేదవాడి కడుపు నింపే లక్ష్యంగా అన్నపూర్ణ అభయ హస్తం పేరుతో రూ:5 భోజనం ఏర్పాటు చేస్తునట్టు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తెలియజేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Miryalaguda : మిర్యాలగూడలో అన్నపూర్ణ అభయ హస్తం.. రూ.5 భోజనం ఏర్పాటు..!

మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలో అతిత్వరలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతీ పేదవాడి కడుపు నింపే లక్ష్యంగా అన్నపూర్ణ అభయ హస్తం పేరుతో రూ:5 భోజనం ఏర్పాటు చేస్తునట్టు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తెలియజేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ రెండేళ్ల కాలంలో నేను ప్రజల మధ్యలోనే ఉన్నాను. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలన చేసి సమస్య పరిష్కారానికి కృషి కృషి చేస్తున్నన్నారు.గత పాలనలో ప్రభుత్వం ఆర్థిక సంక్షోభానికి కారణమైనప్పటికీ ఇప్పటి ప్రభుత్వము ఈ రెండేళ్లలో ప్రభుత్వాన్ని సక్రమంగా గాడిలో పెట్టే దశలోనే పనిచేస్తూ వచ్చింది.. ఇక పరిస్థితి ఉండదు ప్రజలకు ఇచ్చిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సక్రమంగా నడిసాయన్నారు.

ముఖ్యంగా ప్రజల ముందున్నది.. నాపై వ్యతిరేక రావడానికి మిర్యాలగూడకు మంజూరైన ఫ్లైఓవర్లు శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదని.. కారణం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రారంభం కాలేదు తప్పకుండా నా పదవీకాలం పూర్తి సమయానికి పూర్తిచేసే ఎన్నికల్లోకి వెళ్తానన్నారు.

గత ప్రభుత్వము అసెంబ్లీ ఎన్నికల ముందు బడ్జెట్ ఆమోదం లేకుండా పనులు మంజూరు చేసి టెంకాయ కొట్టి చేతులుదులుపుకున్నారే తప్ప ఎలాంటి పురోగతి లేకుండే మా ప్రభుత్వం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో వాటన్నిటికీ బడ్జెట్ నిధులు ఆమోదు చేయించి టెండర్లు పెట్టించి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టడం జరిగిందన్నారు.

గత పదేళ్ల కాలంలో కాగితాలకే పరిమితమైన అభివృద్ధిని.. అస్తవ్యస్తంగా మిగిలిపోయిన పనులను సరిదిద్దుతున్నాం..పట్టణ సుందరీకరణ ధ్యేయంగా 400 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టాం..పట్టణంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా 11 నూతనంగా వాటర్ ట్యాంకులను నిర్మిస్తున్నాం..పట్టణంలో 173 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం,93 కోట్లతో పట్టణంలోని చివరి కాలనీల వరకు తాగునీటి పైప్ లైన్ల నిర్మాణం, ట్యాంకుల నిర్మాణం చేపట్టాం.

సుమారు ఏడు కోట్లతో పెద్ద చెరువు చిన్న చెరువుల సుందరీకరణ పనులు..16 కోట్ల వ్యయంతో పట్టణంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు మురికి కాలువలు నిర్మాణం చేపట్టాం..15 కోట్ల వ్యయంతో మిర్యాలగూడ నుండి తడకమళ్ళ వరకు సిక్స్ లైన్స్ రోడ్డు పనులు చేపట్టాం..మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన రహదారులలో 41 కోట్ల వ్యయంతో విద్యుత్ దీప అలంకరణలు రోడ్ల సుందరీకరణ.

మరో ఏడు కోట్ల వ్యయంతో పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరిస్తున్నాం..పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ పథకం కింద ఐదు రూపాయలకే భోజనం అందించేందుకు పట్టణంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ట్రాఫిక్ ని నియంత్రించేందుకు శెట్టిపాలెం నుండి యాద్గారి పల్లి మీదుగా కోదాడ జడ్చర్ల హైవే వరకు సుమారు 70కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం..అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి..

సాంకేతిక అడ్డంకులు తొలగిపోవడంతో అతి తొందరలోనే నిర్మాణానికి సిద్ధమవుతున్నాం. మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలకు చేరువ చేసేందుకు నిరంతరం పర్యవేక్షిస్తూ.. మరో వంద పడకలతో నూతన భవన నిర్మాణం పూర్తి కావొచ్చింది. అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.

ఇప్పటికే గతానికి భిన్నంగా నూతనంగా 5 డయాలసిస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చాం.. 200 కోట్ల వ్యయంతో మిర్యాలగూడ కి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని మంజూరు చేయించాము. పట్టణంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేందుకు సంబంధిత మంత్రిని ఒప్పించి సాంక్షన్ చేయించాం..

ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నాం.. పట్టణంలో కోతులు కుక్కల బెడదను తొలగించేందుకు సుమారు 70 లక్షలతో ఏబీసీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక కొరత తీరేందుకు సాండ్ బజార్ ఏర్పాటు చేశాం..పట్టణంలో ప్రతి కాలనీకి తాగునీటి వసతులు, సీసీ రోడ్లు, మురికి కాలువల ఏర్పాట్లు, చేసేందుకు అంకితభావంతో పనిచేస్తున్నాం.

సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని గాంధీ పార్క్ పాఠశాల పక్కన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు అన్ని వసతులతో విశ్రాంతి మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం.. అనివార్య కారణాల వల్ల మృతిచెందిన కాంగ్రెస్ కార్యకర్తను ఆదుకునేందుకు కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తున్నాం..పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాటిస్తున్న..మూడు కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ సుందరీకరణ పనులు చేపట్టారు..

29 కోట్ల వ్యయంతో పట్టణంలోని ప్రకాష్ నగర్, బంగారు గడ్డలో రెండు బస్తీ దావకానాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయించాం..మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఆర్టీసీ బస్టాండును ఆధునికరించేందుకు చర్యలు చేపట్టాం. క్రైస్తవుల కోసం 50 లక్షల వ్యయంతో గ్రేవి యార్డ్ నిర్మాణం చేపట్టాం.

ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ , లైటింగ్ నిర్మాణం కోసం 15 లక్షలు మంజూరయ్యాయి.. ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్, లైటింగ్ నిర్మాణం కోసం 25 లక్షలు నిధులు మంజూరు చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ , డి.ఈ వెంకన్న, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

MOST READ 

  1. వికసిత పద్మం.. తెలంగాణలో ఏడుగురికి.. ఆంధ్రాలో నలుగురికి పద్మశ్రీ..!

  2. అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల..!

  3. Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!

  4. Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!

మరిన్ని వార్తలు