Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsతెలంగాణహైదరాబాద్

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య మిస్టరీ వీడిందా.. ఆ రెండు రోజులు ఏం జరిగింది..!

హైదరాబాదులోని బోడుప్పల్ కు చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ విజయా రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న కేసు మిస్టరీ వీడిందా..? మరో రెండు రోజుల్లో వీడనుందా..? ఈ ప్రశ్నలకు అవును.. మిస్టరీ వీడనుందనే సమాధానం వస్తుంది.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య మిస్టరీ వీడిందా.. ఆ రెండు రోజులు ఏం జరిగింది..!

తెలంగాణ బ్యూరో, మన సాక్షి :

హైదరాబాదులోని బోడుప్పల్ కు చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ విజయా రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న కేసు మిస్టరీ వీడిందా..? మరో రెండు రోజుల్లో వీడనుందా..? ఈ ప్రశ్నలకు అవును.. మిస్టరీ వీడనుందనే సమాధానం వస్తుంది. ఆమె ఆత్మహత్యకు పురిగొల్పిన బలహీన కారణాలు ఏమిటి..? అనే అంశంపై పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే బోడుప్పల్ లోని ఇల్లు, లాప్ టాప్, ఆమె మొబైల్ ఆధారాలను రైల్వే పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు దర్యాప్తులో కీలక ఆధారాలు కూడా లభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆమె తీసుకున్న ఈ కఠిన నిర్ణయానికి కారణం ఏమిటి..? ఈ సస్పెన్స్ క్రైమ్ కథ ఏమిటి..? అనే విషయాన్ని రైల్వే పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. వివిధ రకాల కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

ఆ రెండు రోజులు ఏం జరిగింది..?

ఆమె పెళ్లి రోజుకు, ఆమె భర్త పుట్టినరోజుకు మధ్యన రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అయితే ఆమె చనిపోవడానికి భర్త పుట్టిన రోజు సమయం వచ్చిన తర్వాతనే చనిపోయిందా..? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జనవరి 28 న విజయారెడ్డి, సురేందర్ రెడ్డిల పెళ్లిరోజు కాగా జనవరి 31వ తేదీన భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజు. పెళ్లి రోజుకు భర్త పుట్టినరోజుకు మధ్యన కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఉంది.

ఆ రెండు రోజుల్లో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. జనవరి 30వ తేదీన రాత్రి సుమారుగా 10.30 గంటలకు నుంచి 11 గంటల మధ్య వరకు చర్లపల్లి స్టేషన్ కు చేరుకున్న విజయా రెడ్డి తమ ఇద్దరు పిల్లలతో కారు పార్కింగ్ చేసి కారు తాళాలను ఆమె కొడుకు జేబులో పెట్టి స్టేషన్ లోకి వెళ్లారు. అయితే భర్త పుట్టిన రోజు సుమారుగా ఒంటిగంట సమయంలోనే ఇద్దరు పిల్లలను గుండెకు హత్తుకొని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.

అయితే ఆ రెండు రోజుల్లో ఏం జరిగింది. అంత కఠినమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏమి వచ్చింది. అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఆత్మహత్యకు సంబంధించిన కీలక అంశాలను పోలీసులు చేదించినట్లు తెలుస్తుంది. శనివారం లేదా ఆదివారం పోలీసులు కీలక అంశాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

MOST READ 

  1. Gold Rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Damaracharla : పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..!

  3. TG News : ఉద్యోగుల వేతనాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

  4. Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ రూ.50వేలు తగ్గిన బంగారం ధర..!

మరిన్ని వార్తలు