Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు సిస్టర్లు సస్పెండ్..! 

జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్య వహించి గైరాజరైన ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు సిస్టర్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు సిస్టర్లు సస్పెండ్..! 

సూర్యాపేట, మనసాక్షి :

జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్య వహించి గైరాజరైన ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు సిస్టర్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ రోగులకు డాక్టర్లు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో బయోమెట్రిక్ హాజరును పరిశీలించగా, మొత్తం 50 మంది బోధనా సిబ్బంది మరియు ఇతర సిబ్బంది విధులకు గైర్హాజరైనట్లు కలెక్టర్ గుర్తించారు.

దీనిపై తక్షణమే స్పందించిన కలెక్టర్, సంబంధిత విభాగాల అధిపతుల నుండి వివరణ కోరారు. అందులో 44 మంది సిబ్బందికి సంబంధించి హెచ్ఓడిలు సహేతుకమైన కారణాలను తెలియజేశారు. మిగిలిన 6 మందిలో (3)డాక్టర్లు (3) సిస్టర్లు గైర్హాజరీపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా పారిశ్యుద్య నిర్వహణ, రోగులకు అందిస్తున్న పౌష్టికాహారం పై సంతృప్తి వ్యక్తం చేశారు.. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలోని డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు పాటించాలని ఆదేశించారు..

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆసుపత్రిలో సేవలను మరింత ఉన్నత స్థితిలో తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూసుకోవాలని, అత్యవసర విభాగంలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.

నూతనంగా నిర్మించిన ఎం.సి.హెచ్ బ్లాక్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కొత్త బ్లాక్ అందుబాటులోకి వస్తే, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలను ఎక్కువ మంది రోగులకు అందించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మాతా శిశు కేంద్రంలో నెలకు సగటున 240 నుండి 300 ప్రసవాలు జరుగుతుండటంపై సిబ్బందిని అభినందించారు.

ఎన్ఐసియు సేవలు చాలా బాగున్నాయని సిబ్బందికి కితాబిచ్చారు. మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నతీరు పట్ల కలెక్టర్ ప్రశంసించారు.

కలెక్టర్ వెంట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరెండేంట్ డాక్టర్ పి.శ్రవణ్ కుమార్, పీడియాట్రిక్ విభాగం ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎస్.శ్రీకాంత్ భట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జె.మనీషా, డిప్యూటీ సిఎస్ ఆర్ఎంఓలు డాక్టర్ అరుంధతి, బి.జనార్దన్, ఆర్ఎంఓలు డాక్టర్ లక్ష్మణ్, వినయ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు