Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

డిజిటల్ మనీ మార్పిడి లో ఇలా చేస్తే ఖాతా ఖాళీ, జాగ్రత్తలు తీసుకోకుంటే సైబర్ మోసాల్లో చిక్కుకున్నట్టే..!

జీవితం ఒక్కటేని అందరు గౌరవంగా బ్రతకాలనీ అత్యాశకు పోయి సైబర్ మోసాలకు గురై ఆర్థికంగా నష్టపోవద్దని జిల్లా ఎస్పీ కే నరసింహ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేరరహిత సమాజ నిర్మాణం, పౌరుల బాధ్యత, మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణపై ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మునగాల మండల పరిది ఆకుపాముల గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.

డిజిటల్ మనీ మార్పిడి లో ఇలా చేస్తే ఖాతా ఖాళీ, జాగ్రత్తలు తీసుకోకుంటే సైబర్ మోసాల్లో చిక్కుకున్నట్టే..!

మునగాల, మనసాక్షి:

జీవితం ఒక్కటేని అందరు గౌరవంగా బ్రతకాలనీ అత్యాశకు పోయి సైబర్ మోసాలకు గురై ఆర్థికంగా నష్టపోవద్దని జిల్లా ఎస్పీ కే నరసింహ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేరరహిత సమాజ నిర్మాణం, పౌరుల బాధ్యత, మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణపై ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మునగాల మండల పరిది ఆకుపాముల గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొని నేరరహిత సమాజ నిర్మాణం, పౌరుల బాధ్యతకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బినాన్స్, క్రిప్టో కరెన్సీ లాంటి డిజిటల్ మనీ మార్పిడిలో జాగ్రత్తలు పాటించాలని అత్యాశకు వెళ్లి సైబర్ మోసగాళ్లకు చిక్కుకొని సైబర్ నేరాల్లో చుక్కోవద్దని హెచ్చరించారు. డిజిటల్ కరెన్సీ మార్పిడి చేసే విషయంలో అధిక డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోయి ఈ ప్రాంతంలో చాలామంది యువత సైబర్ మోసగాళ్ల ద్వారా డబ్బును పొంది సైబర్ నేరాల్లో చిక్కుకున్నారని తెలిపారు.

ALSO READ : TG : గ్యాస్ కొరత, బుకింగ్ కోసం ఆందోళన చెందుతున్నారా.. ఇలాంటి మోసాలు ఉన్నాయి జాగ్రత్త..!

ప్రస్తుత సమాజానికి డ్రగ్స్ అనే చీడపీడ పట్టిందని ఈ డ్రగ్స్ నిర్మూలించకపోతే సమాజంలో నేరప్రవృత్తి పెరుగుతుందని, పౌరులు డ్రగ్స్ మత్తుకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు.ఇలాంటి డ్రగ్స్ ను మన సమాజం నుండి పారదోలాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. నేడు యువత చెడు అలవాట్లకు గురవుతున్నారని, పిల్లల నడవడికను తల్లిదండ్రులు గమనించాలని తప్పుడు మార్గంలో వెళ్లే పిల్లలను తల్లిదండ్రులు మందలించాలని కోరారు.

ప్రేమ ఆకర్షణలకు లోనై పిల్లలు బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తుంది అన్నారు. షి టీమ్స్, పోలీస్ భరోసా టీం పని చేస్తున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ శివ శంకర్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు రవీందర్, ఏడుకొండలు, కోదాడ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ రామాచారి, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, గ్రామ పౌరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు