Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లామహబూబ్‌నగర్

BREAKING : కేసు నమోదయిందని.. భయంతో వ్యక్తి ఆత్మహత్య..!

BREAKING : కేసు నమోదయిందని.. భయంతో వ్యక్తి ఆత్మహత్య..!

వెల్దండ, మన సాక్షి:

వెల్దండ మండలం కొట్ర చౌరస్తా సమీపంలోని వ్యవసాయ పొలంలో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ (27) గురువారం తెల్లవారుజామున కొట్ర చౌరస్తా సమీపంలోని వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించారు. ఇది గమనించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు.

ఈ మేరకు.. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ కేసులో నిందితుడిగా ఉన్నాడని, ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. దీంతో భయాందోళనకు గురై ఉరివేసుకొని మృతి చెంది వుంటాడని పోలీసులు అనుమానించారు. మృతునికి భార్య కుమారుడు, ఒక కూతురు ఉన్నట్టు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు