Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాకు శ్రీరాం సాగర్ జలాలు..!

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలకు శ్రీరామ్ సాగర్ నాలుగో విడత నీటిని రెండు రోజుల నుండి సూర్యాపేట జిల్లాకు వస్తున్న ఎస్సారెస్పీ జలాలు విడుదల సామర్థ్యాన్ని ఆ శాఖ అధికారులు పెంచారు.

Suryapet : సూర్యాపేట జిల్లాకు శ్రీరాం సాగర్ జలాలు..!

తుంగతుర్తి, మన సాక్షి:

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలకు శ్రీరామ్ సాగర్ నాలుగో విడత నీటిని రెండు రోజుల నుండి సూర్యాపేట జిల్లాకు వస్తున్న ఎస్సారెస్పీ జలాలు విడుదల సామర్థ్యాన్ని ఆ శాఖ అధికారులు పెంచారు. జనగామ జిల్లా కొడకాండ్ల మండల కేంద్రంలోని భజన వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి మధ్యాహ్నం 175 0.క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా తెల్లారి 1800 క్యూసెక్కుల నీరుని వదులుతున్నామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

దీనితో మెయిన్ కాలువలు ఎక్కువ నీరుతో ప్రవహిస్తున్నాయని పశువులను పెద్ద కాలువలకు రాకుండా చూసుకోవాలని అధికారులు తెలిపారు. ఇక పైనుండి బయన్న వాగులోకి 1650 క్యూసెక్కుల నీరు విడుదలవుతుందని తిరుమలగిరి డివిజన్ టు ఈఈ సత్యనారాయణ తెలిపారు. కావున రైతులు నీటిని పొదుపుగా వాడుకొని వృధాగా పోనివ్వకుండా సేద్యానికి వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు