Chicken Shops : ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాప్ లు బంద్.. ఎందుకంటే..!
తెలంగాణ లో చికెన్ ప్రియులకు షాక్. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

Chicken Shops : ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాప్ లు బంద్.. ఎందుకంటే..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ లో చికెన్ ప్రియులకు షాక్. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించడంతో వ్యాపారస్తులు తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నా రని అసోసియేషన్ పేర్కొన్నది.
చికెన్ విక్రయాలపై లాభం తక్కువగా వస్తున్నందున పౌల్ట్రీ వ్యాపారులు మార్జిన్ పెంచాలని వ్యాపారస్తులు డిమాండ్ చేశారు. మార్జిన్ తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తూ తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు చికెన్ సెంటర్లు బంద్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాప్ లు బంద్ కానున్నాయి. దాంతో వేసవికాలంలో చికెన్ కు ఎక్కువగా డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నందున చికెన్ షాపులు బంద్ చేయడంతో మరింత రేటు పెరిగే అవకాశం ఉన్నాయని చికెన్ ప్రియులు పేర్కొంటున్నారు.
MOST READ
- Hyderabad : పుకార్లను నమ్మవద్దు.. ఇంధన కొరత ఏమీ లేదు..!
- Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై.. ఖర్గేకు రాజీనామా లేఖ..!
- Bus Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు దగ్దం..13 మంది సజీవ దహనం..!
- WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. 15 నిమిషాల్లోనే డిలీట్.. ఎలా పని చేస్తుందంటే..!









