Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Miryalaguda : మిర్యాలగూడలో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు..!

Miryalaguda : మిర్యాలగూడలో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

శ్రీరామ నవమి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీ లోని శ్రీ కోదండ రామాలయంలో భక్తిశ్రద్ధలతో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. శ్రీ సీతా రాముల వారి కల్యాణ మహోత్సవం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కార్యక్రమంలో భాగంగా స్వామి వారి రాధయాత్రలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి, డీఎస్పీ రాజశేఖర్ రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పట్టణ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు