Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ఇటుక బట్టీల యజమానులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక, ఆకస్మిక తనిఖీ..! 

ఇటుక బట్టీల వల్ల దుమ్ము, ధూళి తో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ఇటుక బట్టీల వల్ల ప్రజల ఆరోగ్యం, భద్రతకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.

మిర్యాలగూడ పట్టణంలో ఇటుక బట్టీల వల్ల దుమ్ము, ధూళి సమస్య తీవ్రంగా ఉందని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రజల అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి ఆకస్మికంగా ఇటుక బట్టీలను తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ ఇటుక బట్టీ యజమానులతో మాట్లాడుతూ తగిన లైసెన్స్ ఉందా ? అని అడిగారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించడం సహించమని హెచ్చరించారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తహసిల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు