Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేట జిల్లాలో జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశర్ల సత్యనారాయణ పై దాడి..!
సూర్యాపేట జిల్లాలో జలసాధన సమితి వ్యవస్థాపకులు దుశ్చర్ల సత్యనారాయణ పై గొర్ల కాపరులు దాడి చేశారు.

Suryapet : సూర్యాపేట జిల్లాలో జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశర్ల సత్యనారాయణ పై దాడి..!
సూర్యాపేట, మనసాక్షి:
సూర్యాపేట జిల్లాలో జలసాధన సమితి వ్యవస్థాపకులు దుశ్చర్ల సత్యనారాయణ పై గొర్ల కాపరులు దాడి చేశారు. వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన దుశర్ల సత్యనారాయణ జలసాధన సమితి వ్యవస్థాపకులు. రాఘవపురం గ్రామంలో 70 ఎకరాలు భూమిని అడవి భూమిగా చేసి ప్రజలకు, పశుపక్షాదులకు జీవనాధారంగా నిలిచిన వ్యక్తిపై గొర్ల కాపరులు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం హుటాహుటిన తరలించారు. ఈ ఘటన పైన మోతే పోలీస్ లు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.









