Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

SSC : పది ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత.. ద రెయిన్ బో పాఠశాల విద్యార్థులు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల (మాల్ )వీటి నగర్ లో ని ద రెయిన్బో పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించారు.

SSC : పది ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత.. ద రెయిన్ బో పాఠశాల విద్యార్థులు..!

చింతపల్లి, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల (మాల్ )వీటి నగర్ లో ని ద రెయిన్బో పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించారు.

ఈ సందర్భంగా పాఠశాల కో డైరెక్టర్ ఎండి కాజా నవాజ్ , ప్రిన్సిపాల్ సి.వీరేశం, విలేకరులతో మాట్లాడుతూ మా పాఠశాల నుండి 20 26 విద్యా సంవత్సరానికి 26 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అందులో 5 75 /600మార్కుల పోలా.మణిదీప్ అత్యధిక మార్కులు సాధించాడు. 578 నుండి 500 వరకు మరో 18 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించగా . మరో 7గురు విద్యార్థులు 492 నుండి, 447 మార్కుల వరకు మార్కులు సాధించి పాఠశాలకు 100% ఉత్తీర్ణత తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్, ఎండి కాజ నవాజ్, పాఠశాల ప్రిన్సిపాల్ సి.వీరేశం మండలంలో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని పోల మణిదీప్ ను వారి తల్లిదండ్రులను అభినందించి సన్మానించారు. అదేవిధంగా మా పాఠశాలలో చదివి 100% ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, పాఠశాల అధ్యాపక బృందానికి వారు ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. మాకు సహకరించిన విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నామని వారు పేర్కొన్నారు.
.

మరిన్ని వార్తలు