Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Devarakonda : దేశ భవిష్యత్తు విద్యార్థుల తరగతి గదుల్లోనే దాగి ఉంది..! 

దేశ భవిష్యత్తు విద్యార్థి తరగతి గదిలోనే దాగి ఉన్నదని, అదే రేపటి తరం తరాలను మారుస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా, & సినిమాటోగ్రఫీ, శాఖ మంత్రి ఎమ్మెల్సీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ లు అన్నారు. గురువారం దేవరకొండ నియోజకవర్గం లోని కొండల్లేపల్లి మండలం కోల్ ముంతల్ పహాడ్ గ్రామ రైతు వేదిక వద్ద 20 ఎకరాల్లో 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

Devarakonda : దేశ భవిష్యత్తు విద్యార్థుల తరగతి గదుల్లోనే దాగి ఉంది..! 

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 

చింతపల్లి, మనసాక్షి :

దేశ భవిష్యత్తు విద్యార్థి తరగతి గదిలోనే దాగి ఉన్నదని, అదే రేపటి తరం తరాలను మారుస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా, & సినిమాటోగ్రఫీ, శాఖ మంత్రి ఎమ్మెల్సీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ లు అన్నారు. గురువారం దేవరకొండ నియోజకవర్గం లోని
కొండల్లేపల్లి మండలం కోల్ ముంతల్ పహాడ్ గ్రామ రైతు వేదిక వద్ద 20 ఎకరాల్లో 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మా ప్రభుత్వం “విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం” అన్న నమ్మకంతో, రాష్ట్రంలోని విద్యావ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తుందన్నారు.
దేవరకొండలో నిర్మిస్తున్న ఈ స్కూల్ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా, ఒక గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని అన్నారు.
ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో, దేవరకొండలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకొని రాష్ట్ర ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో కలిసి ప్రారంభం చేసుకుందాం అని అన్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు క్యాంపస్‌లోనే ఉండే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి, క్రీడా కార్యక్రమాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని ఈ సమగ్ర ఇంటిగ్రేటెడ్ స్కూల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు.
పనులు వేగంగా సాగేందుకు ప్రతి 15 రోజులకు నిధులు విడుదల చేస్తున్నాం అని మంత్రి పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే డైట్ చార్జీలను 40%, కాస్మెటిక్ చార్జీలను 200% పెంచి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకున్నాంఅన్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు తెలుసుకునే విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. గ్రామీణ రహదారి సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రజల ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందని, అలాగే స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఇది ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు అందుబాటులోకి రావడం వల్ల రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.

దేవరకొండలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని 200 పడకలుగా చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రిని కోరారు. దేవరకొండలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్ని త్వరితగతిన పూర్తి చేసి రైతంగానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది. కొండమల్లేపల్లి గ్రామంలోని కస్తూర్భ గాంధీ బాలికల విద్యాలయంలో 80. 00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి రామ్మోషన్,మన్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు,వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్లు నాయిని జమున మాధవరెడ్డి, దొంతం అలివేలు సంజీవరెడ్డి, ఆర్డీవో రమణా రెడ్డి, డీఈవో కోల్ ముంతల్ పహాడ్ గ్రామ సర్పంచ్ సరస్వతి రవినాయక్ ,సర్పంచ్ యుగేందర్ రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎస్సీ ఈ లక్ష్మారెడ్డి, ఈ డబ్ల్యు ఐ డి సి ,నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేట్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు