Nalgonda : బెంగళూరు గణితశాస్త్ర శిక్షణకు నల్గొండ విద్యార్థినులు ఎంపిక..!
నాగార్జున ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటారు.

Nalgonda : బెంగళూరు గణితశాస్త్ర శిక్షణకు నల్గొండ విద్యార్థినులు ఎంపిక..!
నల్లగొండ, మన సాక్షి:
నాగార్జున ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటారు. కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కె. రాజేశ్వరి,డి. మనీషాలు బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరీటికల్ సైన్సెస్ ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మకమైన “సమ్మర్ స్కూల్ ఫర్ ఉమెన్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్” కార్యక్రమానికి ఎంపికయ్యారు.
ఈ శిక్షణ కార్యక్రమం జూన్ 8 నుండి జూన్ 19, 2026 వరకు బెంగళూరులోని ఐసిటిఎస్ ప్రాంగణంలో జరగనుంది. దేశవ్యాప్తంగా కఠినమైన వడపోత ద్వారా ఎంపిక చేసిన విద్యార్థినులకు గణితం, గణాంక శాస్త్రాలలో ఉన్నత స్థాయి పరిశోధనలు, నూతన అంశాలపై అంతర్జాతీయ నిపుణులతో శిక్షణ ఇస్తారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలలో శిక్షణకు ఎంపిక కావడం గర్వకారణమని,ఇది ఇతర విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని హర్షం వ్యక్తం చేశారు.
శిక్షణకు ఎంపికైన రాజేశ్వరి, మనీషాలను కళాశాల ప్రిన్సిపాల్, గణితశాస్త్ర విభాగ అధ్యక్షులు ఎం. వెంకట్ రెడ్డి అధ్యాపక బృందం డాక్టర్ మధుకర్ రెడ్డి కనకయ్య, మథిన్ హుస్సేన్ , బాల కార్తీక్, తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.









