TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెవెన్యూ శాఖలో భారీ బదిలీలు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవిన్యూ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెవెన్యూ శాఖలో భారీ బదిలీలు..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవిన్యూ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో పాటు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ను మొత్తం 27 మందిని బదిలీ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
సూర్యాపేట అదనపు రెవిన్యూ కలెక్టర్ గా హరి సింగ్, పెద్దపల్లి అదనపు రెవెన్యూ కలెక్టర్ గా రాజ్యలక్ష్మి, సంగారెడ్డి అదనపు కలెక్టర్ ఆర్ డి మాధురి నల్లగొండ ఐ సి ఏ డి స్పెషల్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ గా సంగీత, గద్వాల అదనపు కలెక్టర్ గా మధుమోహన్ పదోన్నతి పొంది బదిలీ అయ్యారు.
అదేవిధంగా నిజామాబాద్ డిఆర్ఓగా గీత, భద్రాద్రి, కొత్తగూడెం డిఆర్ఓగా పద్మావతి, ఆదిలాబాద్ డిఆర్ఓగా స్రవంతి నియామకమయ్యారు. సిరిసిల్ల ఆర్డీవో గా రాజేందర్ రెడ్డి, ఉట్నూరు ఆర్డీవో గా షర్మిల, బోధన్ ఆర్డీవో గా విజయ కుమారి, మిర్యాలగూడ ఆర్డీవో గా రమణారెడ్డి బదిలీ అయ్యారు. బదిలీ అయిన అధికారులంతా తక్షణమే వీధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.









