Breaking Newsక్రైంజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లా
వెల్దండ ఎస్సైగా యుగంధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ.!
వెల్దండ నూతన ఎస్సైగా యుగంధర్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన సూగూరి కురుమూర్తి కల్వకుర్తి ఎస్సైగా బదిలీ అయ్యాడు.

వెల్దండ ఎస్సైగా యుగంధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ.!
వెల్దండ, మన సాక్షి:
వెల్దండ నూతన ఎస్సైగా యుగంధర్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన సూగూరి కురుమూర్తి కల్వకుర్తి ఎస్సైగా బదిలీ అయ్యాడు. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్సైగా పనిచేసిన యుగంధర్ రెడ్డి వెల్దండ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై దృష్టి సారిస్తామని తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బంది నూతన ఎస్సై కి శుభాకాంక్షలు తెలిపారు.









