Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లా

అకస్మాత్తుగా బైకులో మంటలు.. శ్రీశైలం రహదారిపై దగ్ధమైన ద్విచక్ర వాహనం..!

ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి పో పల్సర్ బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఘటన జిల్లా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఉదయం 11:00 గంటలకు జరిగింది.

అకస్మాత్తుగా బైకులో మంటలు.. శ్రీశైలం రహదారిపై దగ్ధమైన ద్విచక్ర వాహనం..!

వెల్దండ, మన సాక్షి:

ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి పో పల్సర్ బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఘటన జిల్లా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఉదయం 11:00 గంటలకు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కంబాలపల్లి సాయి గురువారం దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో ఓ కార్యక్రమానికి వచ్చారు.

శుక్రవారం ఉదయం పెద్దాపూర్ నుంచి గోవిందాయ పల్లికి తిరిగి వెళుతుండగా ఇండియన్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకొని రోడ్డు ఎక్కగానే తన ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు మంటలు చెలరేగాయని తెలిపారు.

ఈ ఘటనలో బైకు పూర్తిగా కాలిపోగా వాహన చోదకుడు వెంటనే అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద పరిస్థితిని పరిశీలించి వివరాలు సేకరించారు.

మరిన్ని వార్తలు