Miryalaguda : ముగిసిన చైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్.. విజేతలకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ బహుమతులు ప్రదానం..!
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ ఎస్ పి క్యాంప్ గ్రౌండ్‌లో నిర్వహించిన చైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు.

Miryalaguda : ముగిసిన చైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్.. విజేతలకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ బహుమతులు ప్రదానం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ ఎస్ పి క్యాంప్ గ్రౌండ్‌లో నిర్వహించిన చైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు.
అనంతరం పట్టణంలోని క్లియో స్పోర్ట్స్ అరేనా వేదికగా నల్గొండ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన
యోనెక్స్-సన్‌రైజ్ 12వ తెలంగాణ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026 ముగింపు కార్యక్రమంలో పాల్గొని వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి మిర్యాలగూడకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విజేతలు, పాల్గొన్న ప్రతి క్రీడాకారుడిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో డిసిసి కార్యదర్శి చిలుకూరి బాలు, కాంగ్రెస్ నాయకులు దేశిడి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










