తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసంగారెడ్డి జిల్లా
రైతులకు శుభవార్త.. రైతు వేదికలలో విత్తన మేళా ఎప్పటినుంచంటే..!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు వేదికలలో విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు

రైతులకు శుభవార్త.. రైతు వేదికలలో విత్తన మేళా ఎప్పటినుంచంటే..!
కంగ్టి, మన సాక్షి :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు వేదికలలో విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి, తడ్కల్ రైతు వేదికల్లో 23 నుంచి 30 వరకు విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాధికారి (ఏవో) హరీష్ పవర్ సోమవారం ఒక ప్రకటనలో అన్నారు.ఈ విత్తన మేళాలో 7 రకాల సన్న వడ్లు విత్తనాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డిఏపిలు లభ్యమవుతాయి. కావున రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.ఈ మేళాలో వ్యవసాయ శాఖ, విత్తన డీలర్లు పాల్గొననున్నారని ఏవో అన్నారు.









