Rythu Bharosa : రైతు భరోసాలో బిగ్ ట్విస్ట్.. ఇకనుంచి ఆ రైతులకు మాత్రమే..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. యాసంగి సీజన్లో కేవలం రెండు విడతలుగా రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకే రైతు భరోసా నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే.

Rythu Bharosa : రైతు భరోసాలో బిగ్ ట్విస్ట్.. ఇకనుంచి ఆ రైతులకు మాత్రమే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. యాసంగి సీజన్లో కేవలం రెండు విడతలుగా రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకే రైతు భరోసా నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు గాను ఈనెల 30వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. అందుకుగాను ప్రభుత్వ అధికారులు నిధుల సమీకరణలో నిమగ్నమై ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 73 లక్షల మంది రైతులకు 9 వేల కోట్ల రూపాయలను ఒకేసారి విడుదల చేస్తారా..? లేదా తొమ్మిది రోజుల్లో విడుదల చేస్తారా..? అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనా యాసంగి సీజన్ లో రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతను ఖరీఫ్ సీజన్ లో పోగొట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా రైతు భరోసా పథకం కేవలం చిన్న, సన్నకారు రైతులకే ఉపయోగపడే విధంగా ఉండాలని.. పెద్ద రైతులు సాగు చేయడం లేదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ ఆధారంగా పంటల సాగు విస్తీర్ణాన్ని పరిశీలించిన ప్రభుత్వం కేవలం 7:20 ఎకరాల వరకు ఉన్న రైతులకే రైతు భరోసా పథకం వర్తింపజేసే విధంగా ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఖరీఫ్ సీజన్ కు గాను రైతు భరోసా పథకాన్ని ముందుగానే అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.









