Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం
Rythu Bharosa : రైతు భరోసా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
రైతు భరోసా పథకం వానాకాలం 2026- 27కు ఈ నెల15 నాటికి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన రైతులు రైతు భరోసా పథకానికి అప్లికేషన్ చేసుకోవాలని చింతపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారిని బి. శ్రావణ కుమారి పేర్కొన్నారు.

Rythu Bharosa : రైతు భరోసా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
చింతపల్లి, మన సాక్షి :
రైతు భరోసా పథకం వానాకాలం 2026- 27కు ఈ నెల15 నాటికి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన రైతులు రైతు భరోసా పథకానికి అప్లికేషన్ చేసుకోవాలని చింతపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారిని బి. శ్రావణ కుమారి పేర్కొన్నారు. గురువారం చింతపల్లి మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇంతకుముందు రైతు భరోసా పథకం అర్హత ఉన్న రైతులు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా ఉంటే మార్చుకొని సరి చేసుకోవాలని రైతులకు సూచించారు.
పూర్తి వివరాల కోసం ఏ ఈ ఓల ను సంప్రదించాలని సూచించారు. రైతులు అందించవలసినవి అప్లికేషన్ ఫారం, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, కాపీలు సంబంధిత క్లస్టర్లలోని రైతు వేదికల వద్ద అంది ఇవ్వాలని పేర్కొన్నారు. జులై 5 తారీకు వరకు రైతు భరోసా దరఖాస్తులు స్వీకరింపబడతాయని ఆమె పేర్కొన్నారు.









