డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి..!
నేటి సమాజంలో ఎంతో మంది యువకులు డ్రగ్స్ లాంటి మత్తు పానీయాలు గంజాయి, తంబాకు, గుట్కా, మద్యం సిగరెట్ లాంటి చెడు వ్యసనాలకు బానిసలై తమ బావి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి..!
చింతపల్లి, మన సాక్షి :
నేటి సమాజంలో ఎంతో మంది యువకులు డ్రగ్స్ లాంటి మత్తు పానీయాలు గంజాయి, తంబాకు, గుట్కా, మద్యం సిగరెట్ లాంటి చెడు వ్యసనాలకు బానిసలై తమ బావి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎక్స్ రోడ్డుపై డ్రగ్స్ నిర్మూల కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల ప్రజలు, యువకులతో కలిసి ఎక్స్ రోడ్డుపై మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించి యువకులచే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా నూతన ఉద్దేశించి వారు మాట్లాడుతూ, యువత చెడు మార్గం వైపు ప్రయాణించకుండా సన్మార్గం వైపు ప్రయాణించి తమ తల్లిదండ్రుల ఆశయాలను నిర్వీర్యం చేయకుండా ఎలాంటి మత్తు పానీయాలకు అలవాటు పడకుండా ఉండి తమ బావి భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకోవద్దు అన్నారు. సమాజంలో కాలం వృధా చేయకుండా స్వయంకృషితో కష్టపడి తమకు నచ్చిన పని చేసుకుంటూ ఆర్థికంగా ముందుకు వెళ్లాలన్నారు. అప్పుడే సమాజంలో మనకు గౌరవం విలువలు పెంపొందుతాయ న్నారు.
అదేవిధంగా రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించి వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆన్లైన్ గేమ్లులు, పేకాట తదితర చట్ట విరుద్ధమైన వాటికి యువత దూరంగా ఉండాలన్నారు. దురు వ్యసనాలకు దూరంగా ఉండి మన భవిష్యత్తును మనమే కాపాడుకుందాం అని యువకులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వివిధ గ్రామాల ప్రజలు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









