Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగం

IAS TRANSFERS : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..!

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగులు ఇచ్చింది.

IAS TRANSFERS : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగులు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావును నియమించింది. అదే విధంగా ఎన్ శ్రీధర్ ను ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాహుల్ బొజ్జకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది.

సవ్యసాచి ఘోష్ కు హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించింది. శైలజ రామయ్యర్ ను ఈ ఎఫ్ ఎస్ అండ్ టి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. అహ్మద్ నదీమ్ ను పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. రఘునందన్ రావుకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.

అజిత్ రెడ్డి ని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ గా బదిలీ చేసింది. కాత్యాయని దేవి ని హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ స్పెషల్ సెక్రటరీగా, గంగాధర్ ని ఆర్ అండ్ బి శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేసింది. వెంకన్న కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది. విద్యాసాగర్ కు టూరిజం డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు