Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లారాజకీయం
ఊర్కొండపేటకు జూలై 4న సీఎం రేవంత్ రెడ్డి రాక..!
నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేటకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి జూలై 4న రానున్నారు.

ఊర్కొండపేటకు జూలై 4న సీఎం రేవంత్ రెడ్డి రాక..!
ఊర్కొండ, మన సాక్షి
నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేటకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి జూలై 4న రానున్నారు. ప్రసిద్ధి గాంచిన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సీఎం దర్శించుకోనున్నారు. తమ రాజకీయ పునాది అయిన ఉమ్మడి మండలంకు సీఎం రానున్నారనిసమాచారం. ఆయన రాక మండల ప్రజల,నాయకుల ఆనందానికి అవధులు లేవు. తమ ప్రాంత నాయకుడి నుండి రాష్ట్ర సీఎం కావడం ఈ గడ్డకు వరం అని కొనియాడారు. సీఎం రాకతో ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.










