Miryalaguda : ప్రైవేట్ ఆస్పత్రులపై ఉక్కు పాదం.. 30 ఆసుపత్రులకు షోకాజు నోటీసులు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారుల బృందం ఉక్కు పాదం మోపింది. సోమవారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 30 ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయడంతో పాటు రెండు డయాగ్నస్టిక్ సెంటర్లను సీజ్ చేశారు.

Miryalaguda : ప్రైవేట్ ఆస్పత్రులపై ఉక్కు పాదం.. 30 ఆసుపత్రులకు షోకాజు నోటీసులు..!
మిర్యాలగూడ, ( మన సాక్షి ):
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారుల బృందం ఉక్కు పాదం మోపింది. సోమవారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 30 ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయడంతో పాటు రెండు డయాగ్నస్టిక్ సెంటర్లను సీజ్ చేశారు.
నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాహుల్ హెచ్చరిక చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లే లక్ష్యంగా డీఎంహెచ్ రాహుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన పలు ఆసుపత్రులపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
సకాలంలో లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండానే వైద్య సేవలు అందిస్తున్న 30 ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, భద్రతా ప్రమాణాలు పాటించకుండా సెల్లార్లలో నిర్వహిస్తున్న రెండు డయాగ్నస్టిక్ సెంటర్లను సీజ్ చేశారు. మెడికల్ మాఫియా కు అడ్డాగా మారిన మిర్యాలగూడలో గతంలో రాష్ట్ర మెడికల్ విజిలెన్స్ బృందం తనిఖీలు చేసి ఇలాంటి అనుమతులు, అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న దాదాపు 8 ఆసుపత్రులను గుర్తించి సీజ్ చేసిన పరిస్థితి ఉంది.
అయినప్పటికీ కొంతమంది మెడికల్ షాప్ యజమానులు, ల్యాబ్ నిర్వాహకులు యదేచ్చగా అర్హతలు లేని వైద్యులతో ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ప్రజల జేబులు కొల్లగొడుతున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ, పలువురు వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.